గిరిజనుల ఆరాధ్య దైవం… సంత్ సేవాలాల్

సంత్ సేవాలాల్ భోధనలు మానవాళికి ఆచరణీయం

*మాత్ర్ర భాషను మరచిపోతే కన్న తల్లిని మరచిపోయినట్లే*

*సంత్ సేవాలాల్ 284 వ
జయంతి ఉత్సవాలలో
మంత్రి జగదీష్ రెడ్డి*

సూర్యాపేట టౌన్, అక్షిత న్యూస్ :

గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ భోధనలు ప్రపంచ మానవాళికి ఆచరణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బంజారా భవన్ లో గురువారం నాడు జరిగిన సేవాలాల్ 284 వ జయంతి ఉత్సవాలు భోగ్ బండార్ వేడుకలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సేవాలాల్ భోధనలను ప్రతిఒక్కరూ ఆచరించాలని అన్నారు. మానవ నాగరికత పరిణామక్రమంలో అనేక మార్పులు చెందుతూ వస్తుందని, కాలంతో పాటు భాష, వస్త్రధారణ, అలవాట్లు మారుతున్నాయని అన్నారు. సమాజంలో ప్రజలు సన్మార్గంలో పయనించడానికి కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు నెలకొల్పారని మంత్రి అన్నారు. ఆంగ్ల భాష వ్యామోహంలో రేపటి తరానికి మాత్ర్రభాషను దూరం చేయవద్దని అన్నారు. భాషను మరవిపోవడం అంటె కన్నతల్లిని, సంస్కృతిని మరచిపోవడమే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రములో అన్ని ఆచార, సంప్రదాయాలకు సముచిత స్థానం లభిస్తుందని, సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం జరిగిందని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రములోని లంబాడి తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించిన ఘనత సిఎం కెసిఆర్ దే అన్నారు. లంబాడి తండాలు ఘర్షణ లేని వాతావరణంలో జీవించాలని, సంత్ సేవాలాల్ భోధనలు పాటించాలని అన్నారు. కోరికలే అనర్దాలకు మూలం కాబట్టి చెడు ఆలోచనలు, కోరికలను మంటలలో దహింపచేయడమే భోగ్ బండార్ అని మంత్రి అన్నారు. ఆర్డీఓ రాజేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజన సహకార సంస్ధ చైర్మన్ రాంచందర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, చివ్వెంల జెడ్పిటిసి సంజీవ్ నాయక్, చిత్రంలో ఎంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్, ఎంపీటీసీ సభ్యురాలు లూనావత్ శాంతాబాయి పండు నాయక్, రిటైర్డ్ డిటిడిఓ లూనావత్ పాండు నాయక్, బిక్షం నాయక్, బాబు నాయక్, ఉద్యోగ సంఘం నాయకులు మోతిలాల్ నాయక్, భద్రు నాయక్, ధారసింగ్ నాయక్, పాండు నాయక్, వెంకన్న నాయక్, బాలు నాయక్, రాజేష్ నాయక్, కౌన్సిలర్ లు పలువురు లంబాడీ గిరిజన ప్రముఖులు, రాజకీయ, ఉద్యోగ, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking