ప్రజా సేవకై… షర్మిల రాజకీయాల్లోకి

ప్రజా సేవకై…
షర్మిల రాజకీయాల్లోకి

-వైయస్ విజయమ్మ

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ప్రజలకు సేవ చేసేందుకు షర్మిలమ్మ రాజకీయాలలోకి వచ్చారని వైయస్ సంక్షేమ పధకాలతో అభివృద్ది చేయాలని లక్ష్యంతో పార్టీ స్థాపించి తెలంగాణ రాష్ట్రంలో ఏన్నో అవమానాలు ఏదురైనా నిలబడేందుకు ముందుకు పోతున్నారని వైయస్ విజయమ్మ అన్నారు.నిన్న ఖమ్మం రూరల్​ మండలం సాయిగణేష్​ నగర్​లో ఏర్పాటు చేసిన వైఎస్సాటీపి పాలేరు క్యాంపు కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయమ్మ మీడియాతో మాట్లాడారు. తన జీవితంలో మాట తప్పని మడమ తిప్పని వైయస్సార్ అని తన తండ్రి వలే షర్మిల కూడా మాట ఇస్తే ఎందాకైనా వెళ్తుందన్నారు. చిత్తశుద్ధితో రాజకీయాలు చేయాలనే షర్మిల ప్రజాప్రస్థానం మొదలు పెట్టిందన్నారు.ఎన్ని అవమానాలు చేసినా అన్నింటా ముందుకే అడుగేస్తుందన్నారు. ప్రజాప్రస్థానం 4 వేల కి.మీ, అంతకు ముందు 3వేల కి.మీ షర్మిల నడక వైయస్సార్ బంగారు పాలన కోసమే అని స్పష్టం చేశారు. షర్మిల అడ్రస్ ఎక్కడా అంటే పాలేరు నియోజకవర్గం అనే చెప్తున్నామని రానున్న రాజకీయాలకు షర్మిల పాలేరు నిర్ణయం గుమ్మం అవుతుందన్నారు. షర్మిల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. వైయస్సార్ ప్రేమా మానవత్వం షర్మిల ప్రజలకు పంచుతోందన్నారు. పాలేరు నుంచే తెలంగాణను పరిపాలిస్తుందన్నారు. మంచి నాయకులుంటే మంచి పరిపాలన రాష్ట్రంలో ఉంటుందన్నారు. దివంగత వైయస్సార్ కు పాలేరుకు రూణానుబంధం ఉందని ఇదంతా దైవేచ్చే అన్నారు. ఎల్లప్పుడూ ఖమ్మం జిల్లా మాకు అండగానే నిలిచిందన్నారు. ఎప్పుడో వైయస్సార్ పాలనలో మొదలెట్టిన ప్రాజెక్టులు ఇప్పటిదాకా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఆంధ్రాలో పులివెందుల ఎలానో తెలంగాణ లో పాలేరు షర్మిలమ్మ కు అలానే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు లక్కినేని సుధీర్ గడిపల్లి కవిత ఖమ్మం నియోజక వర్గ ఇంచార్జ్ తుంపాల కృష్ణమోహన్ పాలేరు డివిజన్ నాయకులు పసుపులేటీ సైదులు షర్మిలా వ్యక్తిగత సహాయకుడు నంద్యాల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking