
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మహా శివరాత్రి పర్వదినం సందరర్భంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచర్ల మండలంలోని వాడపల్లి గ్రామంలో కొలువై ఉన్న మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవాలయంలో, మిర్యాలగూడ పట్టణంలో బోటింగ్ పార్క్ శివాలయంలో శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు కుటుంబసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు.

ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి నల్లమోతు జయ, తనయులు నల్లమోతు సిద్దార్ధ, నల్లమోతు చైతన్య పాల్గొన్నారు.