ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ

బీఆర్ఎస్ పాలనలో

ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ
* శాసనమండలి చైర్మన్ గుత్తా,

ఎమ్మెల్యే భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పాలనలో ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యుడు నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు వారు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం దామరచర్ల మండలంలో వాడపల్లి గ్రామంలో కొలువై ఉన్న మీనాక్షి అగస్తేశ్వర స్వామీ దేవాలయంలో, అడవిదేవులపల్లి మండలంలో సత్రశాలలోని పంచాయతన సోమేశ్వర స్వామీ (బౌద్దమ గుళ్ళు) దేవాలయంలో వారు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సమిటీ సభ్యులు వారిని శాలువాలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అదే విధంగా మిర్యాలగూడ పట్టణంలో మెయిన్ బజార్ లోని భ్రమారంబ దేవి సమేత మల్లిఖార్జున స్వామి దేవాలయంలో నిర్వహించిన శాంతి కళ్యాణ మహోత్సవంలో వారు పాల్గొన్నారు.

కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, డీసీఎంఎస్ జిల్లా వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కుందూరు వీరకోటి రెడ్డి, జడ్పీటీసీ లలిత హాతీరాం, సేవ్యా నాయక్, ఎంపీపీ ధీరావత్ నందిని రవితేజ, ధనవత్ బాలాజీ నాయక్, మాజీ ఎంపీపీ కురాకుల మంగమ్మ చినరామయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ధనవత్ చిట్టిబాబు నాయక్, సర్పంచ్ కొందూటి మాధవి సిద్దయ్య, కొత్త మర్రెడ్డి, మైనారిటీ నాయకులు యూసుఫ్, బండారు కుషలయ్య, యువనేత నల్లమోతు సిద్దార్ధ, బండి వెంకటేశ్వర్లు, పలు గ్రామాల సర్పంచ్లు,మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking