
పోలీస్ వేదింపులతో మృతి చెందిన ఖదీర్ ఖాన్ కుటుంబాన్ని ఆదుకోవాలి
-సామాజిక కార్యకర్త యువ న్యాయవాది
సాదిక్ షేక్
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
మెదక్ పట్టణంలోని అరబ్ గల్లిలో గత నెల 29న గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ చేశాడు. సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హైదరాబాద్‌లో పని చేసే పిట్లం బేస్ వీధికి చెందిన మహమ్మద్ ఖదీర్‌ను ఎంక్వైరీ పేరుతో చోరీ ఘటన జరిగినప్పుడు ఖదీర్ హైదరాబాద్ లో ఉన్నా అని చెప్పినా వినకుండా ఎస్సై రాజశేఖర్ ఇద్దరు ఐడీ పార్టీ కానిస్టేుళ్లు పవన్ ప్రసాద్ అతడిని మెదక్ తీసుకొని వెళ్ళడం జరిగింది. మృతుడి వాంగ్మూలం ప్రకారం దాదాపు ఐదు రోజులు అక్రమ కస్టడీలో ఉంచి అతడి పై ధర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ తల కిందలు గా వేలాడదీసి లాఠీలు బెల్ట్లు తడి గుడ్డలతో తీవ్రంగా కొడుతూ హింసించి చంపారని యువ న్యాయవాది సాదిక్ షేక్ మాట్లాడుతూ ఖమ్మం కు చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసు లో ఏ విధంగా అయితే న్యాయం జరిగిందో అలానే మొహమ్మద్ ఖదీర్ ఖాన్ కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం ఖదీర్ భార్య కు ప్రభుత్వ ఉద్యోగం డబల్ బెడ్రూం ఇల్లు పిల్లలకు ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు.రాజకీయాలకు కుల మతా లకు అతీతంగా ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథం తో ఖదీర్ కుటుంబాన్నీ ఆదుకోవాలని, న్యాయం జరిగే వరకు బాసట గా నిలుద్దాం అని సాదిక్ షేక్ మనవి చేశారు.న్యాయం జరగని పక్షం లో మైనారిటి కమిషన్, మానవ హక్కుల కమిషన్ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దళిత సంఘాలతో కలిసి ఉద్యమాలు నిరసన లు తీవ్రతరం చేస్తామని న్యాయవాది సాదిక్ షేక్ తెలిపారు.