ప్రత్యేక పూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ.
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
మహాశివరాత్రి సందర్భంగా కూకట్ పల్లి దీనబంధు కాలనీలోని శ్రీ శివ భక్త మార్కండేయ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. అలగే
రాత్రి 7 గంటలకు శివపార్వతుల కళ్యాణం మరియు రాత్రి 11:30 కు లింగోద్వ పూజా కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ బోడ అశోక్, ఆలయ కమిటీ సభ్యులు మురళి, దాన పత్రి అశోక్, ఆనంద్, అనిల్,బిక్షపతి, శ్రీనివాస్, పుట్టా శివశంకర్, నరసింహారావు, లక్ష్మీనారాయణ, శ్రీహర్ష శ్రీనివాస్, వివేకానంద నగర్ 122 డివిజన్ ఉపాధ్యక్షులు అల్లమ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.