మాదిగల చైతన్యంతోనే హక్కుల సాధన

మాదిగల చైతన్యంతోనే

హక్కులు సాధ్యమవుతాయి

-వ్యవస్థాపక అధ్యక్షులు

యాతాకుల భాస్కర్

ఖమ్మం/ అక్షిత బ్యూరో : మాదిగల చైతన్యం తోటే హక్కులు సాధ్యమవుతాయని మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు యాతాకుల భాస్కర్ అన్నారు.నిన్న ఖమ్మంలో మహాసభలో మాట్లాడూతూ గత 30 సంవత్సరాలుగా మాదిగ దాని అనుబంధ కులాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే నేటి తెలంగాణ ప్రభుత్వం వరకు నిరంతర పోరాటం కొనసాగుతూనే ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలన ఇంకా మనల్ని అణచివేస్తూనే ఉన్నాయి 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కూడా భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు మనకి అందని ద్రాక్ష గానే మిగిలాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లని తూట్లు పొడుస్తున్నాయి ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే మెజారిటీగా ఉన్న మాదిగల ఆకాంక్షైన ఏబిసిడి వర్గీకరణ ఎప్పుడో పరిష్కారమయ్యేది ప్రభుత్వాల మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో అనేక హామీలు ఇస్తూ అవి పరిష్కారం కాకుండా మాటలకే పరిమితమయ్యే విధంగా వ్యవహరిస్తున్నాయి అందుకే మాదిగ జాతిలో చదువుకున్నటువంటి యువకుల్ని సైనికులుగా తయారుచేసి హక్కుల సాధన వైపుగా తమ జాతిని యుద్ధానికి సిద్ధం చేస్తూ ఈనెల 27 28న ఖమ్మంలో దండోరా మహాసభలను నిర్వహించారు.ఈ సభ ద్వారా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల వైపు మాదిగ జాతిని మళ్లిస్తూ నూతన రాష్ట్ర కమిటీని నియమించారు.

*నూతన కార్యవర్గం ఏన్నిక*

జాతీయ ప్రధాన కార్యదర్శి గా క్యాదాసి భాస్కర్ మాదిగ.రాష్ట్ర అధ్యక్షులుగా కొంగరి శంకర్ మాదిగ.వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఖమ్మం కి చెందిన కొరిపల్లి శ్రీనివాస్.చిలుక రాజనర్స్ ఉపాధ్యక్షులు గా కూరం లింగయ్య ములుగు కృష్ణ.ప్రధాన కార్యదర్శులుగా ఇల్లందు సుధాకర్ కాలేశ్వరపు సాల్మాన్ ,కార్యదర్శులుగా మేళ్లచెరువు కృష్ణబాబు రెడపంగి సైదులు సహాయ కార్యదర్శిలు అరికెల రాజయ్య,రావూరి విజయభాస్కర్ వడ్డపల్లి శ్రీనివాస్ పందుల గోపాల్.రాష్ట్ర యువసేన కన్వీనర్ గా గొల్లపల్లి నరేష్ కుమార్ లను ఏన్నుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking