విద్యార్థుల్లో సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించాలి

*విద్యార్థులలో సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించాలి..*

*- రామన్నపేట సి ఐ మోతీరాం*

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

నేటి విద్యార్థులలో చదువుతో పాటు సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపాద్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని రామన్నపేట సి ఐ మోతీరాం కోరారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్లో మంగళవారం సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

రామన్నపేట సర్పంచ్ గోదాసు శిరీష పృధ్విరాజ్ జ్యోతి ప్రజ్వలన చేయగా అనంతరం సి ఐ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థులలో ఆలోచన నైపుణ్యాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి దోహదపడుతాయని అన్నారు. సర్పంచ్ గోదాసు శిరీష పృద్విరాజ్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థుల ఆలోచనలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను సాధించాలని కోరారు.

అనంతరం పర్యావరణ, వైద్య, అంతరిక్ష, రవాణా తదితర అంశాలపై విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలను వారు తిలకించి విద్యార్థులను, వారికి సహకరించిన ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాన్డెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ జె.మణి, ఉపాధ్యాయులు మురళీ, రషీద్, నరేష్, శ్యామ్, మహాలక్ష్మీ, అస్మా, సుమయా, పూనమ్, నిర్మల, కరుణ, లక్మిదేవి, జానకి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking