జర్నలిస్ట్ రాజేశ్వర్ రావుకు
ఐజేయూ, టీయుడబ్ల్యుజె నివాళి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
సీనియర్ పాత్రికేయులు, Hmtv సలహాదారులు సి.హెచ్.రాజేశ్వర్ రావు మృతి పట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశాయి. మంగళవారం నాడు బోయిన్ పల్లిలోని హష్మత్ పేట్ లో రాజేశ్వర్ రావు మృతదేహాన్ని ఐజేయూ జాతీయ అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీలు సందర్శించి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మీడియా రంగానికి రాజేశ్వర్ రావు అందించిన సేవలను గుర్తుచేస్తూ, ఆయన కుటుంబ సభ్యులను శ్రీనివాస్ రెడ్డి ఓదార్చారు.