
ఆనందోత్సవాల నడుమ హోళీ
భార్గవ్ దంపతుల హోళీ కేరింతలు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : హోళీ సంబరాలు మిర్యాలగూడలో అంబరాన్నoటాయి. సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా హోళీ సంబరాలు ఇంటిల్లి పాది జరుపుకుండ్రు.మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తిరునగర్ భార్గవ్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి తిరునగర్ నాగలక్ష్మి భార్గవ్ హోళీ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలంతా ఆనందోత్సాల నడుమ ఇంటిల్లిపాది సుఖ,సంతోషాలతో హోళీ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.