ఎన్బీఆర్’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాదిరి పరీక్ష

‘ఎన్బీఆర్’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాదిరి పరీక్ష
* శిక్షణా తరగతులకు హాజరైన విద్యార్థుల్లో మనోధైర్యం పెరిగింది
* సంకల్పమే విజయానికి తొలి మెట్టు కావాలి

ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగావకాశాల ప్రకటనలకు అనుగుణంగా పలు పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్ధులకు తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాదిరి పరీక్ష నిర్వహించినట్టు యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పేర్కొన్నారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని గ్రంథాలయంలో 150 మార్కులకుగానూ జనరల్ స్టడీస్ పై నిర్వహించిన మోడల్ పరీక్ష విద్యార్థుల విజయానికి సోపానంగా మారనుందని నల్లమోతు సిద్దార్ధ తెలిపారు. ఎన్బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు హాజరైన విద్యార్థుల్లో మనోధైర్యం పెరిగిందన్నారు. జనరల్ స్టడీస్ మోడల్ పరీక్షకు 312 మంది అభ్యర్థులు హాజరయ్యారని అన్నారు.
వీరిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అభ్యర్థులైన
భోగోజు భవాని, జానిపాష, సుభాష్ లకు ఉచితంగా గ్రూప్-4 మెటీరియల్‌ను అందజేసినట్టు నల్లమోతు సిద్దార్ధ తెలిపారు.

ఉద్యోగార్ధులకు ఆశాదీపం ‘నల్లమోతు సిద్దార్ధ’

పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఔత్సాహిక ఉద్యోగార్థులకు యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ ఆశాదీపంగా మారారు.
గ్రూపు-2,3, 4, పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు తమ ఫౌండేషన్ ద్వారా ఉచిత శిక్షణ అందిస్తున్నారు.
గత ఆరేండ్ల నుంచి శిక్షణా తరగతులకు హాజరయ్యే అభ్యర్థులందరికీ ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తూ నల్లమోతు సిద్దార్ధ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఎన్బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణా తరగతులకు హాజరైతే చాలూ సులువుగా, సునాయాసంగా సర్కారీ కొలువును సాధించవచ్చని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. తరగతుల నిర్వహణ స్ఫూర్తిదాయకంగా , సరళంగా ఉందని చెబుతున్నారు. గతంలో అనేక మంది ఎన్బీఆర్ ఫౌండేషన్ లో శిక్షణా తరగతులకు హాజరై ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి వారి జీవితాల్లో స్థిరపడ్డారు. ఎన్బీఆర్ ఫౌండేషన్ లో సుశిక్షితులైన, అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన రాష్ట్రస్థాయిలో ఎన్బీఆర్ ఫౌండేషన్ లో శిక్షణ పొందుతున్న తాము కచ్చితంగా ప్రభుత్వ కొలువు సాధిస్తామని అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాము పొందాల్సిన శిక్షణ కోసం వేళల్లో ఫీజులు చెల్లించి సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా నిబద్ధతతో, అంకితభావంతో మిర్యాలగూడ పట్టణంలో తమకు శిక్షణా తరగతులను ఏర్పాటు చేసిన ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్దకు అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking