జరీనా’ చేయూత స్ఫూర్తిదాయకం

ముస్లిం మహిళలకు ‘జరీనా’ చేయూత స్ఫూర్తిదాయకం
* 20 మందికి 25 కిలోల బియ్యం బస్తా చొప్పున పంపిణీ చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం
* మొదటి విడతలో భాగంగా ఐదుగురికి అందజేత

సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ పట్టణానికి చెందిన ముస్లిం మహిళ జరీనా పవిత్ర రంజాన్ మాసంలో సాటి మహిళలకు తన వంతుగా చేయూత అందించేందుకు ముందుకొచ్చారు. నల్లగొండ జిల్లాకు చెందిన ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ పిలుపు మేరకు 20 మంది మహిళలకు తన వంతుగా 25కిలోల బియ్యం బస్తాలను అందజేసేందుకు ఆమె ముందుకొచ్చారు. బుధవారం దీనిలో భాగంగా బండి కన్వెన్షన్ హాల్ వద్ద హమీద్ షేక్ సమక్షంలో మొదటి విడతగా ఐదుగురికి 25కిలోల బియ్యం బస్తాలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హమీద్ షేక్ మాట్లాడారు. పవిత్ర రంజాన్ ఉపవాసాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయని అన్నారు. ముస్లిం సోదర సోదరీమణులు రంజాన్ ఉపవాస దీక్షలను భక్తి, శ్రద్ధలతో చేపట్టాలని కోరారు. పవిత్ర రంజాన్ మాసంలో సేవా భావంతో సాటి ముస్లిం నిరుపేద మహిళలకు సాయం అందేంచాలనే విశాల థృక్పథంతో ముందుకొచ్చిన జరీనా ఔదార్యం నిరూపమానమైనదని హమీద్ షేక్ అభివర్ణించారు. ఆమె నిర్వహించే సేవా కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తానని హమీద్ షేక్ భరోసా ఇచ్చారు. అనంతరం మొదటి విడత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా, మరో మూడు విడతాల్లో మిగతా వారికి బియ్యం పంపిణీ చేయనున్నట్టు జరీనా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సల్మాన్, జనిపాషా, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking