కవిత్వం రాయడం అంటే జీవితాన్ని రాసుకోవడమే

కవిత్వం రాయడం అంటే జీవితాన్ని రాసుకోవడమే

ఉప్పల పద్మ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

విద్యార్థుల కవిత్వం రాయాలంటే తమ జీవితాల్లోకి తగ్గించుకోవాలని ఇంటా బయట బడిలో జరుగుతున్న సంఘటనలను చూస్తూ స్పందించాలని ప్రముఖ రచయిత్రి ఉప్పల పద్మ అన్నారు. బకళ్వాడి పాఠశాలలో మంగళవారం లీగల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కవిత్వం ఎలా రాయాలో ఎందుకు రాయాలో తను ఎలా కవిత్వము రాసిందో, ఎదిగిందో విద్యార్థులతో పంచుకున్నది. బాగా చదవడం రాయడం ద్వారానే విద్యార్థులు భవిష్యత్తులో రచయితలుగా మారే అవకాశం ఉంటుందని అందుకు బాగా గ్రంథాలయంలోని పుస్తకాలు చదవాలన్నారు. ఆమె రాసుకున్నటువంటి కవిత స్త్రీ మీద స్త్రీ శ్రమ మీద విద్యా చదువు మీద రాసుకున్న కవితను ఈ సందర్భంగా చదివి వినిపించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వచ్చిన ఆర్టీసీ డిఎం బి.పాల్ తనదైన గానం తోటి విద్యార్థులను మనసుల్ని గెలిచారు. పువ్వు ఎలా వికసిస్తుందో విద్యార్థులు చదువుతూ అలా వికసించాలని తన మాట పాటలతోటి అద్భుతంగా విద్యార్థులకు అద్భుతమైనటువంటి ఉపన్యాసాన్ని అందించారు ఈ సందర్భంగా. ప్రముఖ కవి రావిరాల అంజయ్య విద్యార్థుల బాల్యం చాలా అమూల్యమైనదని పిల్లలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ఇతర అంశాల పట్ల దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో గిరిజన గురుకుల కళాశాల ఆంగ్ల అధ్యాపకులు వెంకటరత్నం, ప్రముఖ గాయకులు లక్ష్మయ్య, లీగల్ లిటరసీ క్లబ్ కన్వీనర్ కస్తూరి ప్రభాకర్, ఉమాశంకర్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking