
పంచాంగ శ్రవణoలో భార్గవ్ దంపతులు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని కనకదుర్గ ఆలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో సతీమణి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ శ్రీమతి తిరునగర్ నాగలక్ష్మీ భార్గవ్ తో కలిసి పాల్గొన్నారు.