పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి

పెండింగ్ కేసులను
సత్వరం పరిష్కరించాలి

మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం

జిల్లా యస్.పి కె అపూర్వరావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ సబ్ డివిజనల్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో గత నెలలో జరిగిన నేరాలపై చర్చించి పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా యస్పి అపూర్వరావు మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపించి వాటి సంఖ్యను తగించేలా కృషి చేయాలని అన్నారు .ఇందుకోసం కోర్టులలో న్యాయమూర్తులతో చర్చించి కేసుల పురోగతి, విచారణ విషయాలలో అధికారులంతా చురుకుగా పని చేయాలని సూచించారు. ఇదే సమయంలో కోర్టు కేసులలో శిక్షల శాతం మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నేర నియంత్రణలో బాగంగా సొసైటీ పర్ పబ్లిక్ సేఫ్టీ లో బాగంగా ప్రతి పట్టణంలోని కాలనీల్లో,గ్రామాలలో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేల ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, ప్రమాదాల నివారణ కొరకు రోడ్డు భద్రతపై అవగాహన సమావేశాలు నిర్వహించాలని, పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలను అరికట్టాలని, అక్రమ గంజా రవాణా, పేకాట, మట్కాలను అరికట్టాలన్నారు. దొంగతనాలు జరగకుండా రాత్రి పూట గస్తి బీట్‌లు, పెట్రోలింగ్‌ నిర్వహించాలని 100 కాల్ కి వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందజేయలన్నారు. రానున్న రంజాన్,శ్రీ రామనవమి,హనుమాన్ జయంతి పండుగలను ప్రజలు శాంతి యుతంగా నిర్వహించుకోవాలని అన్నారు. ఎవరైనా మత విద్వేషాలకు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ఇతర మతాలకు చెందిన వారి పట్ల మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టిన వ్యాఖ్యలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని, మత విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై, వారి కదలికలపై నిఘా పెట్టడం జరిగిందని అన్నారు.కుల మతాలకు అతీతంగా పండుగలను శాంతియుత వాతావరణం నిర్వహించుకోవాలని ప్రజలు పోలీస్ వారి సూచనలు పాటిస్తూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డిఎస్పీ వెంకటగిరి, సిఐ లు రాఘవేందర్, సత్యనారాయణ,నరసింహ, గాంధీ నాయక్,నాగరాజు యస్.ఐలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking