రుచి, సుచితో మన్ననలు పొందాలి

రుచి, సుచితో మన్ననలు పొందాలి

ఉన్నత ప్రమాణాలతో ఉన్నత స్థానం 

సినీ నటి హనీ రోజ్

శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :
రుచి, సుచితో కస్టమర్ల మన్ననలు పొందాలని సినీ నటి హనీ రోజ్ అన్నారు. శుక్రవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్, మదీనాగూడలో గిస్ మత్ జైల్ మండిని ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చక్కటి రుచి, సుచితో కూడిన ఆహారాన్ని అందించినప్పుడు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. ప్రతి వ్యక్తి నాణ్యమైన ఆహారం కోసం ఎంత దూరమైనా వెళ్లి తినాలనే అభిలాష ఉంటుందన్నారు.

హోటల్ రంగంలో నూతనంగా ఎంట్రీ అయిన మేనేజ్ మెంట్ అనుభవం గడించిన మాస్టర్స్, చెప్స్ తో క్వాలిటీ, క్వాంటిటిని అందించి మంచి బ్రాండ్ ను పొందాలని ఆకాంక్షించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివిన యువత సైతం హోటల్ వ్యాపార రంగంలోకి ఎంట్రీకావడం అభినందనీయమన్నారు. తనతో పాటు మరింత మందికి ఉపాధి కల్పించేందుకు వ్యాపార రంగంలోకి దిగిన యువత రాణించాలని ఆకాంక్షించారు.

వ్యాపారంలో వృద్దిచెంది మరిన్ని బ్రాంచ్ లతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ గిస్ మత్ జైల్ మండి మేనేజ్ మెంట్ కొత్త దినేష్, కొత్త వీరాంజనేయులు, కొత్త లక్ష్మి, సృజన్ కుమార్, గౌతమి చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking