రాహుల్ పై వేటు అప్రజాస్వామికం

రాహుల్ పై వేటు అప్రజాస్వామికం
ముంబై రహదారిపై కాంగ్రెస్ రాస్తారోకో 

టీపీసీసీ జనరల్ సెక్రెటరీ జెరిపెటి జైపాల్

శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :
ఏఐసీసి మాజీ అధ్యక్షులు రాహూల్ గాంధీపై అక్రమ వేటు వేయడం అప్రజాస్వామికం. శుక్రవారం రోజున చందానగర్ లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముంబై రహదారిపై తమ నిరసనను వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నిజాలు నిర్భయంగా చెప్పినందుకు, మోదీలాంటి అసమర్ధుని పాలనను నిలదీసి నినదించినందుకు గాను పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసినందుకు నిరసనగా , టీపీసీసీ జనరల్ సెక్రెటరీ జెరిపెటి జైపాల్ ఆధ్వర్యంలో బీజేపీ నిరంకుశ పాలన విధానాలను దుయ్యబడుతూ నిరసన తెలిపి, రాస్తారోకో చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దగ్దం చేయడం జరిగింది.బీజేపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి అని నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు, పార్టీ డివిజన్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking