‘విశిష్ట’ ఫౌండేషన్ సేవలు విశిష్టమైనవి
రంజాన్ మాసంలో పలు ముస్లిం కుటుంబాలకు కిట్ల పంపిణీ అభినందనీయం
సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన విశిష్ట ఫౌండేషన్ సేవలు విశిష్టమైనవని నల్లగొండ జిల్లా ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ ప్రశంసించారు.

పవిత్ర రంజాన్ మాసంలో పలు ముస్లిం కుటుంబాలకు విశిష్ట ఫౌండేషన్ వారు హమీద్ షేక్ చేతుల మీదుగా కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హమీద్ షేక్ మాట్లాడారు. రంజాన్ మాసంలో పలు నిరుపేద కుటుంబాలకు సాయం అందించేందుకు ముందుకు వస్తున్న దాతల సేవలు అనిర్వచనీయమని అన్నారు. స్వచ్చంద సంస్థలు అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడతాయని అన్నారు. అన్ని వర్గాల వారికి తమ సేవలను అందించేందుకు విశిష్ట ఫౌండేషన్ శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని కితాబిచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఫౌండేషన్స్ అభివృద్ధి కోసం తన వంతుగా సహకారం అందించేందుకు తానెప్పుడూ ముందుంటానని హమీద్ షేక్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫిరోజ్, సాధిక్, తదితరులు పాల్గొన్నారు.