ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి

*జనయేత్రి వ్యవస్థాపక అధ్యక్షులు మున్నీర్ అహ్మధ్ షరీఫ్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

సేవా దృక్పథంతో ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మున్నీర్ అహ్మద్ షరీఫ్ అన్నారు.
ప్రతి నెల ఒకటిన మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాలలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరంలో భాగంగా శనివారం సీతారామపురంలో కౌన్సిలర్ మల్గం రమేష్ సహకారంతో వైద్య శిభిరం నిర్వహించామన్నారు. వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతు జనయేత్రి ఫౌండేషన్ వైద్య శిబిరాలు, అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్డు పెద్దలు వాలుగొండ నర్సింహ, బిఆరత నాయకులు జంజిరాల నాగరాజు, శ్రీనివాస్, పున్న రమేష్, సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు సంతోష్
సీతారాంపురం వాస్తవ్యులు యాదగిరి, సమద్, హమీద్, ఇస్మాయిల్, సిరాజ్ , లక్ష్మి, ప్రవీణ, ఉమ, రమణ, రఫత్, రమ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకొని వైద్యుల సలహాలతో మంచి మందులు వాడుతూ జీవన ప్రమాణాన్ని పెంచుకోవాలని కోరారు. జనయేత్రీ ఫౌండేషన్ కార్య నిర్వాహక అధ్యక్షుడు పోగుల సందీప్ మాట్లాడుతూ ఫౌండేషన్ చేస్తున్న సేవలను గుర్తించి సభ్యులుగా చేరి చేయూత నివ్వాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో అహ్మద్ షరీఫ్ ల్యాబ్ టెక్నీషియన్లు రమేష్, యాదగిరి, ఖాసీంలు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలను ,థైరాయిడ్ పరీక్షలను కేవలం రూ.70లకు నిర్వహించారు. బుల్లిబాబు, కృష్ణ, అరుణ్ లు ఉచితంగా మందులు అందచేశారు. కార్యక్రమంలో జనయేత్రి ఫౌండేషన్ సహాయ కార్యదర్శి అమీర్అలి, సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, సాయి, రషీద్, చరణ్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking