కేంద్రం వైఖరితో ప్రమాదంలో ప్రజాస్వామ్య భవిష్యత్తు
*కేసీఆర్ ను ఆప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు
*భాస్కర్ రావు నేతృత్వంలో నియోజకవర్గం అభివృద్ధి
*శాసనమండలి చైర్మన్ గుత్తా
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో భవిష్యత్తులో ప్రజాస్వామ్యం ప్రశ్నార్ధకంగా మారనుందని రాష్ట్రశాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు మోడీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. దేశాన్ని సిబిఐ ఈడి ఐటి సంస్థలు పాలిస్తున్నాయని ఇది దేశమనుగడకు ప్రమాదకరమన్నారు. పార్లమెంటరీ వ్యవస్థను విఘాతం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని దానిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర హక్కులను జీఎస్టీ పేరుతో హరించి వేస్తుందని గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధికి అడ్డం పడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,17,578 ఉందని, కేంద్రమే ప్రకటించిందని దేశంలోని అగ్రభాగంలో ఉన్నామని చెప్పారు అభివృద్ధి పథంలోనూ తెలంగాణ ముందంజలో ఉందన్నారు. కక్షపూరితంగానే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హక్కులను హరించి వేస్తుందని అభివృద్ధికి అడ్డం పడుతుందని విభజన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. కేంద్రం తీరు పట్ల కెసిఆర్ బలంగా కొట్లాడుతున్నాడని దీనికి అన్ని పక్షాలు కలిసి రావాలని కోరారు. భవిష్యత్తులో బిజెపికి వ్యతిరేకంగా విపక్షాలు అన్ని కలిసే అవకాశం ఉందని చెప్పారు. పేపర్ లీకేజీ పై ప్రభుత్వ వై నిందలు వేయడం సరైనది కాదని పరీక్షలు పారిదర్శకంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే 1.36 లక్షల ఉద్యోగాలు కల్పించారని, మరో 80 వేల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. సమయం వచ్చినప్పుడు అవసరం అనుకున్నప్పుడు తన వారసుడు రాజకీయాలకు వస్తాడని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బిజెపిని అడ్డుకున్నందుకే కమ్యూనిస్టు పార్టీలతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందని భవిష్యత్తులో కూడా కలిసి పని చేస్తారని చెప్పారు మిరియాలు కూడా నియోజకవర్గంలో భాస్కరరావు నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు భవిష్యత్తులో కూడా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరుస్తారని చెప్పారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు అప్రజాస్వామికమన్నారు.
Next Post