బిసిలకు అన్ని రంగాల్లో బిసిలకు అన్యాయం

బిసిలకు అన్ని రంగాల్లో

బిసిలకు అన్యాయం
*ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి రవి


మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

దేశ జనాభాలో సగభాగమున్నా బిసిలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి నాదగోని రవి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ మండలం యాద్గారుపల్లి గ్రామంలో ఎంసిపిఐయు నల్లగొండ జిల్లా జనరల్ బాడి సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిసి జనగణన, మండల్ కమిషన్ సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. రైతులకు ప్రయోజనం చేకూర్చని పిఎం ఫసల్ భీమా యోజన అన్నదాతల పేరు మీద కంపెనీలకు ఆదాయం 6సంవత్సరాల కాలంలో 40వేల కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం కంపెనీలకు మిగిల్చిందన్నారు. రైతన్నలకు ఈ ఏడాది వాతావరణం గట్టి పరీక్ష పెడుతుందన్నారు. అకాల వర్షాలు వడగళ్ల వానల వల్ల చాలా చోట్ల పంటలు నాశనమయ్యాయి. గోధుమ , ఆవాలు, ఆలు, ఉల్లి, మిరప , మొక్కజొన్న, వరి పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహాయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై పన్నులు వేస్తు కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ దేశ సంపదను వారికి దోచిపెడ్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాలుగా దేశంలో అమలు చేస్తున్న కార్పొరేట్, మతోన్మాద అనుకూల విధానాలను రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణమే విరమించు కోవాలన్నారు. కేంద్రం పెంచిన టోల్ టాక్స్ లను ఉపసంహరించుకోవాలన్నారు. నిత్యావసర వస్తువులు రవాణా చేసే వాహనాలపై భారం పడడంతో రవాణా, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయన్నారు. ఎంసిపిఐయు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటాలు చేస్తుందన్నారు. ఇంటి స్థలాలకై వేలాది మంది నిరుపేదలు గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు పేదలకు ఇచ్చే స్థితిలో ప్రభుత్వం లేదన్నారు. సమావేశంలో ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వస్కుల మట్టయ్య, జిల్లా కార్యదర్శి సైదమ్మ, జిల్లా సహాయ కార్యదర్శి గోపి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాతంగి విశాలాంధ్ర, వస్కుల చంద్రకళ , పోతుగంటి కాశి , వల్లపుదాసు వెంకన్న , రామాంజి జ్యోతి, గుడుగుంట్ల మారయ్య , దీరావత్ లాలు నాయక్, ఈటమళ్ళ లింగమ్మ , గడ్డి వీరయ్య , వల్లమల్ల ఆశీర్వాదం, వస్కుల కిరణ్, బొల్లంపల్లి సైదమ్మ , వల్లపుదాసు యాదయ్య , వస్కుల ఆమని , కందుకూరి మహేష్, పోతుగంటి వేణు , ఎడ్ల సందీప్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking