కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి ఉత్తమ్ ప్రతిపాదనలు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలోని రైల్వే పనులు, తదితర పలు డిమాండ్లను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైభవ్ దృష్టికి నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తంకుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారని గురువారం ఎంపి క్యాంపు కార్యాలయం నుండి జారీ చేసిన ప్రకటనలో తెలిపారు.

డోర్నకల్-నేలకొండపల్లి – కోదాడ-హుజూర్ నగర్ -నేరేడుచర్ల-మిర్యాలగూడ కొత్త రైల్వే లైన్ మంజూరు చేసి వెంటనే పనులు మొదలు పెట్టాలని కోరారు. మోటమర్రి-జగ్గయ్యపేట- మేళ్లచెర్వు-మఠంపల్లి-జాన్ పహాడ్-విష్ణు పురం-మిర్యాలగూడ రైల్వే లైన్ లో ప్యాసింజర్ రైళ్లను నడపాలని, వందే భారత్, నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ ప్రెస్ రైళ్లను నల్గొండ, మిర్యాలగూడలో హాల్ట్ కల్పించాలని,
ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరి నిర్మించాలని,
రైల్వే మంత్రికి ఎంపి ఉత్తమ్ సుదీర్ఘంగా విషయాలను పలుమార్లు పార్లమెంట్ లో ప్రస్తావించారని ఇవి అత్యవసర విషయాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking