అంగరంగ వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు డివిజన్ లలో హనుమాన్ జయంతిని పురస్కరించకుని హనుమాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు, హనుమాన్ దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేయించి డివిజన్ వీదులలో శోభయాత్ర నిర్వహించారు. కొత్తగూడ, వి వి నగర్ మరియు హఫీజ్ పేట్ లోని పలువురి ముఖ్యనాయకుల ఆహ్వానం మేరకు హనుమాన్ దేవాలయాల్లో నిర్వహించిన శోభయాత్రకు ముఖ్యతిధిగా తెలంగాణ రాష్ట్ర యువమోర్చ కోశాధికారి రఘునాథ్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హనుమాన్ శోభయాత్ర గల ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమంలోరక్తపు సందీప్ గౌడ్, జిల్లా యువమోర్చ కార్యదర్శి కుమార్ సాగర్, డివిజన్ అధ్యక్షులు శ్రీకాంత్ నాయక్, సాయి, బీజేపీ నాయకులు కరణ్ గౌడ్, రాజు ముదిరాజ్ విశ్వనాధ్ వినయ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.