హనుమాన్ జన్మోత్సవ్ వేడుకలు
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
హనుమాన్ జన్మోత్సవ్ పురస్కరించుకొని గురువారం శేర్లింగంపల్లి నియోజకవర్గం కూకట్ పల్లి డివిజన్ దినబందు కాలనీలోని చౌరస్తా వద్ద గుండ్లకొండ బాలు ఆధ్వర్యంలో హనుమాన్ జన్మత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గొట్టుముక్కల పెద్ద భాస్కరరావు పాల్గొన్నారు. ప్రత్యేక పూజ అనంతరం శాలువతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటకృష్ణ, ములుగు రామారావు, రమేష్, విజయ్ కుమార్, ఎల్లం నాయుడు, మహేంద్ర నాయక్, గడ్డం కృష్ణ, అజ్జు, మహేష్ , అన్వేష్, తదితరులు పాల్గొన్నారు