క్రమశిక్షణతో ఉన్నత స్థానాలకు ఎదగాలి
* అప్పర్ కేజీ విద్యార్థులకు, ప్రయిమరీ లెవల్ పూర్తి చేసుకున్న వారికి గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం
* చిన్నారులను దీవించి ధ్రువపత్రాలు ప్రదానం చేసిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ స్వర్ణలత
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : పట్టుదలతో చదివితే ఉజ్వల భవిష్యత్తు లభిస్తుంది. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని మిర్యాలగూడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ స్వర్ణలత ఆకాంక్షించారు.స్థానిక ఎస్ఆర్ డిజి పాఠశాలలో అప్పర్ కేజీ విద్యార్థులతో పాటుగా ప్రయిమరీ లెవల్ పూర్తి చేసుకున్న ఐదో తరగతి విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మిర్యాలగూడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ స్వర్ణలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే గురించి అవగాహన కల్పించి ధృవపత్రాలను ప్రదానం చేసేందుకు కార్యక్రమాన్ని నిర్వహించిన జోనల్ ఇంఛార్జ్ ఎస్ఎల్ రణధీర్, ప్రిన్సిపల్ పుట్టల శ్రీనివాస్ ను అభినందించారు.

విద్యార్థులకు తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులని, పిల్లలు సమాజంలో ఎలా మెలగాలో పెద్దలపట్ల మర్యాదగా నడుచుకునే విధానాలను తల్లిదండ్రులే నేర్పించాలని అన్నారు. అదేవిధంగా విద్యార్థులు తాము ప్రస్తుతం చదువుతున్నటువంటి తరగతిని పూర్తిచేసుకుని పై తరగతులకు ప్రమోట్ అయినందున విద్యార్థులు శ్రద్ధతో విషయపరిజ్ఞానాన్ని పెంపొందించుకొని సమాజానికి ఉపయోగపడే భావిభారత పౌరులుగా ఎదగాలని కోరుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాఠశాల జోనల్ ఇంచార్జ్ రణధీర్ మాట్లాడుతూ విద్యావ్యవస్థలో ఉన్న వివిధ స్థాయిలలో విద్యార్థులు తమ విద్యను పూర్తిచేసుకుని పై స్థాయికి వెళ్తున్న సందర్భంలో చేసే కార్యక్రమం అని అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా విని అర్థం చేసుకొని తల్లిదండ్రుల కలలను సహకారం చేయాలని కోరారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ పుట్టల శ్రీనివాస్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శోభ, ఉపాధ్యాయులు సరస్వతి, ఎండి రావూఫ్, నస్రిన్, విజయలక్ష్మి, నాగరాజ్ ,రవి, నజీర్, ముంతాజ్, నాగలక్ష్మి, నేహా, వాణి, వసంత,అనిత, పుష్ప, శకుంతల, పీఈటీ నారాయణ, మునీర్, శోభారాణి, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.