అట్టహాసంగా రాములు గౌడ్ జన్మదిన వేడుకలు

ఉద్యమకారుడు రాములు గౌడ్ జన్మదినం సందర్భంగా మజ్జిగ పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు…

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
ఆల్విన్ కాలనీ డివిజన్ ఏరియా కమిటీ మెంబర్ తెలంగాణ ఉద్యమకారుడు రాములు గౌడ్ జన్మదినం సందర్బంగా బిఆర్ఎస్ నాయకులు చిన్నోల శ్రీనివాస్, పి వెంకటేష్, హరీష్, కుంచాల వెంకట్ ఆధ్వర్యంలో ముస్లింలకు మజ్జిగ పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ తనయుడు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు దొడ్ల రామకృష్ణ గౌడ్ పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు.పెద్ద ఎత్తున పాల్గొన్న ముస్లింలు, టిఆర్ఎస్ నాయకులు, అభిమానులు, ప్రజలు. ఈ సందర్భంగా రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో ఉద్యమాలు చేసి బంగారు తెలంగాణలో తను భాగ్యస్వామి అయిన రాములు గౌడ్ జన్మదినం సందర్భంగా మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఎప్పుడూ అందరితో కలివిడిగా ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి అందరి శ్రేయస్సు కోరుకునే మంచి మనసున్న రాములు గౌడ్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకొని ప్రజలకు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాశీనాథ్ యాదవ్, హరీష్, పి వెంకటేష్ గౌడ్,ప్రదీప్ రెడ్డి, చిన్నోళ్ల శ్రీనివాస్, వెంకట్, సాయి గౌడ్, సంపత్, భాస్కర్, సతీష్, దేవేందర్, మున్నా భాయ్, అశోక్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking