దాతల సహకారం స్ఫూర్తిదాయకం
* యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ముస్లిం మహిళ జరీనా
* 20 ముస్లిం కుటుంబాలకు కూరగాయల పంపిణీ అభినందనీయం
సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
పవిత్ర రంజాన్ మాసంలో దాతలు అందిస్తున్న సహకారం స్ఫూర్తిదాయకమని నల్లగొండ జిల్లా ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ అభివర్ణించారు. మిర్యాలగూడ పట్టణానికి చెందిన ముస్లిం మహిళ జరీనా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.

జరీనా మిత్ర బృందంతో పాటు ఆసిఫ్, బాలూ నాయక్ సహకారంతో ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 20 ముస్లిం కుటుంబాలకు 9రకాల కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హమీద్ షేక్ మాట్లాడారు. రంజాన్ ఉపవాస దీక్షలను క్రమశిక్షణతో, భక్తి, శ్రద్దలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. రంజాన్ ఉపవాస దీక్షలను చేపడుతున్న మహిళలకు కూరగాయలను పంపిణీ చేసిన దాతలకు మనః పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. తన పిలుపు మేరకు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు హమీద్ షేక్ తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఆదివారం నాటికి 21 కార్యక్రమాలను నిర్వహించినట్టు తెలిపారు. తన యొక్క మిత్ర బృందం, అభిమానులు, శ్రేయోభిలాషులు, అనుచరుల సహకారంతో ఇప్పటి వరకు 920 మందికి సాయం అందించినట్టు తెలిపారు. ప్రతి ఏడాది రంజాన్ మాసంలో1000 కుటుంబాలకు పైగా కిట్లను అందజేస్తున్నట్టు హమీద్ షేక్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రఫీ, సాజిద్, తదితరులు పాల్గొన్నారు.