బాలూనాయక్, అహద్ అభినందనీయులు

బాలూనాయక్, అహద్ అభినందనీయులు
* 20 ముస్లిం కుటుంబాలకు మటన్ కిట్లు పంపిణీ అభినందనీయం

తెలంగాణ రాష్ట్ర హై కోర్టు న్యాయవాది హమీద్ షేక్ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

#మిర్యాలగూడ పట్టణంలో సీతారాంపురంలోని
గీతా ట్రావెల్స్ నిర్వాహకులు బాలూ నాయక్, అహద్ అభినందనీయులని తెలంగాణ రాష్ట్ర హై కోర్టు న్యాయవాది, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ అభివర్ణించారు. పవిత్ర రంజాన్ మాసంలో 20 ముస్లిం కుటుంబాలకు ఒక్కొక్కరికి అర కిలో చొప్పున మటన్ కిట్లను పంపిణీ చేసిన బాలూ నాయక్, అహద్ ఔదార్యం మహోన్నతమైనదని కొనియాడారు.

ఆదివారం మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో హమీద్ షేక్ మాట్లాడారు. సర్వమత సౌభ్రాతృత్వాన్ని చాటుతూ పలు ముస్లిం కుటుంబాలకు తమ వంతుగా చేయూత అందించేందుకు ముందుకు వస్తున్న దాతలకు ఆయన ధన్యవాదములు తెలియజేశారు. అంతేకాకుండా, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకు వచ్చిన బాలూ నాయక్, అహద్ కు తన మద్దతు, సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హమీద్ షేక్ భరోసా ఇచ్చారు. సోషల్ సర్వీస్ లో చురుకైన పాత్ర పోషిస్తూ పలు ముస్లిం కుటుంబాలకు సాయం అందిస్తున్న ముస్లిం యువతి జరీనా అనతికాలంలో వేలాదిమందికి స్ఫూర్తిప్రదాత అయ్యారని హమీద్ షేక్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సోహెల్, రఫిక్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking