సైకాలజీ రంగానికి
ఊపిరిపోసిన వ్యక్తి
డాక్టర్ హిప్నో కమలాకర్
నవభారత లయన్స్ క్లబ్ అధ్యక్షులు సీహెచ్ గోపాలకృష్ణ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
సైకాలజీ రంగానికి ఊపిరిపోసిన వ్యక్తి డాక్టర్ హిప్నో కమలాకర్ అని నవ భారత లయన్స్ క్లబ్ అధ్యక్షులు సీహెచ్ గోపాలకృష్ణ కొనియాడారు. హిప్నాటిజంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్ హిప్నో కమలాకర్ 57వ జయంతి, 2వ వర్థంతి పురస్కరించుకుని ప్రొగ్రెసివ్ సైకలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బేగంబజార్ లోని ఎస్ ఆర్ డి రెయిన్ బో హోంలో సోమవారం హోం పిల్లలకు అన్నదానం నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ హిప్నో కమలాకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సీ హెచ్ గోపాలకృష్ణ మాట్లాడుతూ తన వృత్తినే ఇంటి పేరుగా మార్చుకుని దేశ వ్యాప్తంగా హిప్నోటిజం ప్రదర్శనలు చేసి హిప్నాటిజం శక్తి సామర్థ్యాలను నిరూపించిన ఘనత డాక్టర్ హిప్నో కమలాకర్ కే దక్కుతోందని అన్నారు. అంతే కాకుండా హిప్నాటిజాన్ని, సైకాలజీతో మేళవించి అనేక మానసిక సమస్యలను నివారించ వచ్చని సమాజానికి చాటి చెప్పిన మహా మేధావి అని అన్నారు. సీనియర్ న్యాయవాది జి. కృష్ణవేణి మాట్లాడు తూ డాక్టర్ హిప్నో కమలాకర్ జర్న లిస్ట్ , న్యాయవాదిగా, సైకాలజిస్ట్ గా, హిప్నాటిస్ట్ గా ఈ సమాజానికి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించిన గొప్ప మానవతా వాది అని కొనియాడారు. కార్యక్రమంలో ప్రొగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఇండియా జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ హిప్నా పద్మాకమలాకర్, ప్రముఖ స్టేజ్ హిప్నాటిస్ట్ హిప్నో హిమకర్, ఎస్ఆర్డీ రెయిన్బో హోం నిర్వాకురాలు పార్వతి, విద్యార్థులు పాల్గొన్నారు.