డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సృజన స్రవంతి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులొ భూమి కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలి
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సృజన స్రవంతి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులొ భూమి కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని
- కొమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన బీఎస్పీ నాయకులు
ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సృజన స్రవంతి ప్రాజెక్టులొ భూమి కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటివరకు తగిన న్యాయం జరగడం లేదని, రైతులకు ప్రభుత్వం ఇప్పటివరకు తగిన న్యాయం జరపకపోగా వారికి ఇవ్వాల్సిన ఎకరానికి కనీస మద్దతు ధర ఇవ్వకుండా వారిని మోసం చేసింది వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తున్న రైతులు నేడు వలస కూలీలుగా జీవనం సాగిస్తున్నారు వారికి తక్షణమే ప్రభుత్వం ఎకరానికి 6 లక్షల రూపాయల చొప్పున చెల్లించి కోల్పోయిన భూమిని మరొక చోట వారికి చూపించి అట్టి బాధిత రైతులకు ప్రభుత్వం పక్కా ఇండ్లు కట్టించాలని అలాగే సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకుటుంబ సభ్యులు మరియు అతని అనుచరులు అధికారo అడ్డుపెట్టుకొని నోటిఫైడ్ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న వెంచర్లను తొలగించాలని , ఇట్టి కాలంలో భూములు కొమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది… డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సృజన స్రవంతి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులొ భూమి కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటివరకు తగిన న్యాయం జరపకపోగా వారికి ఇవ్వాల్సిన ఎకరానికి కనీస మద్దతు ధర ఇవ్వకుండా వారిని మోసం చేసింది వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తున్న రైతులు నేడు వలస కూలీలుగా జీవనం సాగిస్తున్నారు వారికి తక్షణమే ప్రభుత్వం ఎకరానికి 6 లక్షల రూపాయల చొప్పున చెల్లించి కోల్పోయిన భూమిని మరొక చోట వారికి చూపించి అట్టి బాధిత రైతులకు ప్రభుత్వం పక్కా ఇండ్లు కట్టించాలని
అలాగే సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకుటుంబ సభ్యులు మరియు అతని అనుచరులు అధికారo అడ్డుపెట్టుకొని నోటిఫైడ్ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న వెంచర్లను తొలగించాలని , ఇట్టి కాలంలో భూములు అధికార పార్టీ నాయకుల చేతుల్లో కబ్జాలకు గురవుతున్నాయి బట్పల్లి శివారులోని సర్వే నెంబర్ 82 మరియు 100 / ఈ భూములు చింతలమానేపల్లి గ్రామపంచాయతీలో భూములు, లోన వెళ్లి కంచర్పేట్ లోని భూములు అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ బెదిరింపులకు పాల్పడుతూ దౌర్జన్యంగా వారి భూములపై అధికార పార్టీ బలంతో జరుగుతున్న అన్యాయాలను బహుజన సమాజ్ పార్టీ, ఆదివాసీ సంఘాలఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలోఆదివాసి సంఘాల నాయకుడు సోయం చిన్నన్న , బిఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి, సిర్పూర్ నియోజకవర్గం బీఎస్పీ పార్టీ ఇంచార్జ్ అర్షద్ హుస్సేన్ ,నియోజకవర్గ అధ్యక్షుడు కొండా రాంప్రసాద్, బీఎస్పీ కాగజ్ నగర్ పట్టణ అధ్యక్షులు నక్క మనోహర్,బీఎస్పీ నాయకులు రేణిగుంట్ల శ్రీను, పండగ రాజేష్, ప్రాణహిత భూనిర్వాసితుల సంఘం నాయకులు మురళి గౌడ్ , శ్రీనివాస్ , రమేష్ పాల్గొన్నారు.