వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టం చేయాలి

  • ఎఐకెఎఫ్ ఆవిర్భావoలో మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : రైతులు పండించిన పంటలకు కనీసం మద్దతు ధర అందేలా సమగ్ర మద్దతు ధర చట్టం చేయాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం స్థానిక రైతు సంఘం కార్యాలయంలో అఖిల భారత కిసాన్ సభ 88వ ఆవిర్భావం సందర్భంగా జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ రైతులు ఎన్నో కష్టాలు పడి పంటలను సాగు చేస్తున్నాడని తీరా పంట అమ్ముకునే సమయంలో సరైన ధర రాకపోవడంతో నష్టపోతున్నాడని వాపోయారు. పెట్టిన పెట్టుబడులు చేసిన కష్టానికి ప్రతిఫలం దక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర చట్టం చేసి రైతులను ఆదుకోవాలన్నారు. వ్యవసాయానికి రైతులను దూరం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, రద్దు చేసిన చట్టాలు దొడ్డిదారిన అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రైతులు అప్రమత్తంగా ఉండి రైతన్న వ్యతిరేక విధానాలపై బలమైన పోరాటాలు చేయాలన్నారు. రైతులకు అండగా దేశవ్యాప్తంగా అఖిల భారత కిసాన్ సభ ఏర్పడిందని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాల రద్దు చేయడంలో జరిగిన ఉద్యమంలో రైతు సంఘం కీలక పాత్ర పోషించిందన్నారు. రైతుల సంక్షేమం కోసం సంఘం పనిచేస్తుందన్నారు. రైతులు సంఘంలో ఉండి తమ సమస్యలను ఉద్యమాల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డి.మల్లేష్, ఎం.రవినాయక్, సిఐటియుజిల్లా సహయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, భవాండ్ల పాండు, పి.వరలక్ష్మి, పాదూరి శశిధర్రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, టి.రామ్మూర్తి పగిడోజి రామ్మూర్తి, పాల్వాయి రామ్ రెడ్డి, చౌగాని వెంకన్న, కోటి రెడ్డి, వాడపల్లి రమేష్, లెంకల మాధవరెడ్డి, సోమయ్య, రామారావు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking