మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : మహాత్మ జ్యోతి రావు ఫూలే జయంతిని మండల పరిషత్ అధ్యక్షులు నూకల సరళ హనుమంత్ రెడ్డి మంగళవారం ఆధ్వర్యంలో నిర్వహించారు. నల్లమోతు భాస్కర్ రావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు బార్గవ్, నల్లగొండ జిల్లా రైతు బందు అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జడ్పి కో ఆప్షన్ సభ్యులు మోహ్సిన్అలీ, మండల బిఆర్‌ఎస్ అధ్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, మండల రైతు బందు అద్యక్షులు గడగొజు ఏడుకొండలు, పట్టణ బిసి సంఘ నాయకులు కంచి సత్యనారాయణ, ఎంపిటిసిలు, సర్పంచులు, బిఆర్‌ఎస్ నాయకులు, ఎంపిడిఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, ఎంపిఓ టి.వీరారెడ్డి, పిఆర్ ఎఇ ఆది నారాయణ, సూపరింటెండెంట్ పి.కరుణాకర్ రావు, కార్యాలయ, ఉపాధి హామీ పథకం, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.