కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి : మహాత్మ జ్యోతిబాపూలే 197’వ జయంతి సందర్భంగా మంగళవారం కూకట్ పల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు అనంత నాగరాజు, ఓ.బీ.సీ అధ్యక్షుడు దిలీప్ కుమార్ అధ్యక్షతన పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్శనపల్లి సూర్యారావు ముఖ్యఅతిథిగా విచ్చేసి పులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే గొప్ప సంఘసంస్కర్త, మహిళల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని,ప్రతి ఒక్కరి చదువు కోసం పోరాడిన మహనీయుడు జ్యోతిబాపూలే అని అన్నారు.అంతేకాకుండా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కి గురువుగా, ఆదర్శవంతంగా ఉన్న వ్యక్తి జ్యోతిబాపూలే అని తెలియజేశారు. జ్యోతిబాపూలే తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఏమాత్రం బెదరకుండా దృఢ సంకల్పంతో తన విద్యను పూర్తి చేసి, సమాజం కోసం పనిచేస్తూ అనగారిన వర్గాల వెన్నంటూ ఉంటూ వారి యొక్క గెలుపులో తోడుంటూ వారికోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహనీయుడు జ్యోతిబాపూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు నాయినేని సూర్యప్రకాష్ రావు, నాయినేని పద్మారావు, వడ్డేపల్లి రాజేశ్వరరావు, యంజాల పద్మయ,చౌదరి ధర్మారావు,రాష్ట్ర ఓబిసి మోర్చా నాయకులు చేదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ , డివిజన్ నాయకులు ఈరంటి సాయికుమార్, చెరుకూరి మహేష్, జంగంపల్లి సాయి, కట్ట శంకర్ రెడ్డి, కృష్ణప్రియ, రాఘవేందర్, రమణారెడ్డి, శ్రీధర్ ,అఖిల్. తదితరులు పాల్గొన్నారు.