ధాన్యం కొనుగోళ్లు షురూ
ఎంఎల్ఏ కంచర్ల భూపాల్ రెడ్డి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
నల్గొండ పట్టణం అర్జాల బావిలో ఏర్పాటు చేసిన పి. ఏ.సి.ఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళ వారం నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి 2022-23 సంవత్సరం లో మొట్ట మొదటి గా ఆర్జాల బావి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించు కోవటం జరిగిందని తెలిపారు.రైతు సంక్షేమం ధ్యేయం గా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.రైతులకు సాగు నీరు,ఉచిత విద్యుత్,పెట్టు బడి సాయం అంద చేయడంతో అధిక ధాన్యం ఉత్పత్తి తో దేశం లోనే రాష్ట్రం ముందంజ లో వుందని ఆయన అన్నారు.రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్,రైతులకు ఎకరానికి 10 వేల రూ ల పెట్టు బడి సాయం కింద అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని తెలిపారు.పంట సాగు కు రైతులను ఆదుకోవడం తో పాటు పండించిన ధాన్యం ను మద్దతు ధర కు కొనుగోలు చేస్తుందని అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు కోట్ల రూ.లు ఖర్చు పెట్టి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
రైతుకు ఆరబోసిన నాణ్యత ప్రమాణాలు పాటించి ధాన్యం తీసుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం ఆదేశాల ననుసరించి జిల్లాలో ధాన్యం కొను గోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.కొనుగోలు కేంద్రం లో రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని,కొనుగోలు కేంద్రాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
జిల్లాలో యాసంగిలో 278 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు,ఇంకా అవసరం ను బట్టి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించటం జరుగుతుందని తెలిపారు.రైతులు నాణ్యత ప్రమాణాలు,నిర్ణీత తేమ శాతం వచ్చిన ధాన్యం తీసుకు రావాలని అన్నారు.కొను గోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు తర్వాత రైతు వివరాలు ఓ.పి.ఎం.ఎస్.లో నమోదు చేయడం జరుగుతుందని,బ్యాంక్ పాస్ పుస్తకం అకౌంట్ నంబర్,సెల్ కు ఓ. టి.పి.వస్తుందని, రైతులు చెక్ చేసుకోవాలని,చెల్లింపు జాప్యం కాకుండా వుంటుందని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతుల ఖాతాల్లో చెల్లింపు చేసేలా వేగవంతం గా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అదనపు కలెక్టర్(రెవెన్యూ) భాస్కర్ రావు మాట్లాడుతూ తాలు లేకుండా నాణ్యతా ప్రమాణాలు ,తేమ శాతం పాటించాలని, కొనుగోలు చేసిన మూడు రోజుల్లో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో చెల్లింపు చేస్తున్నట్లు తెలిపారు.రైతులు ధాన్యం తో పాటు పట్టాధార్ పాస్ పుస్తకం,బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం,ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ లు తీసుకొని రావాలని ఆయన సూచించారు.

ప్రతి పది మిల్లులకు ఒక అధికారి ని నియమించినట్లు,కొనుగోలు చేసిన వెంటనే అదే రోజు ధాన్యం విక్రయించిన రైతుల ఓ.పి.ఎం.ఎస్ లో వివరాలు నమోదు చేయాలని అన్నారు.వేసవి కాలం లో కొనుగోలు కేంద్రాల్లో త్రాగు నీరు, ఓ.అర్.ఎస్.ప్యాకెట్ లు,షామియానా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,డి.అర్.డి. ఓ కాళిందిని,జిల్లా సహకార అధికారి రాజేందర్ రెడ్డి,జిల్లా పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర రావు,అర్.డి. ఓ జయ చంద్ర రెడ్డి,పి. ఏ.సి.ఎస్.చైర్మన్ నాగ రత్నం రాజు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కలెక్టర్
నల్గొండ మండలం చందన పల్లి లో పి. ఏ.సి.ఎస్.,చిన్న సూరారం లో ఐ.కె.పి.ద్వారా ఏర్పాటు చేసిన యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి మంగళవారం ప్రారంభించారు.రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ భాస్కర్ రావు,జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,డి.అర్.డి. ఓ కాళిందిని,జిల్లా సహకార అధికారి రాజేందర్ రెడ్డి,జిల్లా పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర రావు,అర్.డి. ఓ జయ చంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.