ఉప్పల్లో SRH ఊచకోత..
ఢిల్లీ ఎదుట 243 పరుగుల భారీ టార్గెట్
ఐపీఎల్ 2026లో భాగంగా సొంత
హైదరాబాద్ అక్షిత ప్రతినిధి
గడ్డపై జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) పరుగుల ప్రవాహాన్ని పారించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న ఈ పోరులో హైదరాబాద్ బ్యాటర్లు చెలరేగిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 242 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచారు. ఈ మ్యాచ్లో ప్రధాన ఆకర్షణ ఓపెనర్ అభిషేక్ శర్మ నిలిచారు. మొదటి బంతి నుంచే ఎదురుదాడికి దిగిన అభిషేక్ (135), ఢిల్లీ బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో ఉతికేస్తూ మెరుపు సెంచరీ బాదారు. ఉప్పల్ స్టేడియం నలుమూలల బంతిని తరలిస్తూ ఆయన చేసిన విధ్వంసం అభిమానులకు కనువిందు చేసింది.
బ్యాటర్ల సమష్టి కృషి..
అభిషేక్తో పాటు మిగిలిన బ్యాటర్లు కూడా తమ వంతు పాత్రను అద్భుతంగా పోషించారు. పవర్ ప్లేలో తనదైన శైలిలో ట్రావిస్ హెడ్(37) మెరుపులు మెరిపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (25) కూడా సమయోచితంగా ఆడుతూ భారీ షాట్లతో అలరించారు. ఇన్నింగ్స్ చివర్లో క్లాసెన్(37) తనదైన ‘మార్క్’ ఫినిషింగ్తో స్కోరును 242 మార్కుకు చేర్చారు.
నిస్సహాయ స్థితిలో ఢిల్లీ బౌలర్లు..
హైదరాబాద్ బ్యాటర్ల దాటికి ఢిల్లీ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఎంత ప్రయత్నించినా వికెట్లు తీయలేక భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కరు మాత్రమే ఒక వికెట్ తీయగలిగారు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 243 పరుగుల హిమాలయమంత లక్ష్యం ఉంది. ఇంత భారీ లక్ష్యాన్ని ఢిల్లీ ఎలా ఛేదిస్తుందో చూడాలి. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తున్న తరుణంలో ఈ మ్యాచ్ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.