కోట రెజోనెన్స్ క‌ళాశాల కృషి అభినంద‌నీయం

కోట రెజోనెన్స్ క‌ళాశాల కృషి అభినంద‌నీయం

 మ‌హిళా మోర్చా రాష్ట్ర నాయ‌కులు సుజాత‌రెడ్డి

కరీంనగర్ అక్షిత బ్యూరో

గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా భవిష్యత్‌కు బలమైన పునాది వేస్తున్న కోట రెజొనెన్స్ జూనియర్ కళాశాల కృషి అభినందనీయమని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు డాక్టర్ పి. సుజాత రెడ్డి అన్నారు. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ఇంట‌ర్ ఫ‌లితాల్లో క‌రీంన‌గ‌ర్‌లోని కోట రెజొనెన్స్ జూనియర్ క‌ళాశాల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలతో అత్యుత్తమ ప్రతిభ కనబరచి కరీంనగర్ జిల్లాలోనే విశేష గుర్తింపు పొందారన్నారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ అంజిరెడ్డిని సుజాత‌రెడ్డి ఆధ్వర్యంలో మంగ‌ళ‌వారం ఘనంగా సన్మానించారు. అనంత‌రం సుజాత రెడ్డి మాట్లాడుతూ ఈ తరహా ఫలితాలు సాధించడం వల్ల ఇతర విద్యాసంస్థలకు ఇది ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్ర‌తి ఏటా అత్యుత్త‌మ ఫ‌లితాలు సాధిస్తూ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌త్యేక గుర్తింపును పొందుతోంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నాయకులు, అతిథులు మాట్లాడుతఊ కళాశాల యాజమాన్యం కృషిని ప్రశంసిస్తూ, విద్యార్థుల విజయానికి టీచింగ్ స్టాఫ్ యొక్క అంకితభావం, క్రమశిక్షణ ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మీనా, తులసి, లలిత, రమా, రిజ్వాన్, విష్ణు, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking