ఐఐటి- జెఈఈ మెయిన్స్ -2026 ఫలితాలలో అల్ఫోర్స్ కు ర్యాంకుల పంట
కరీంనగర్ అక్షిత బ్యూరో
సోమవారం ప్రకటించిన ఐఐటి- జెఈఈ మెయిన్స్ -2026 ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో జాతీయస్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు.ఐఐటి- జెఈఈ మెయిన్స్ -2026 ఫలితాలు విడుదల అయిన అనంతరం స్థానికి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఎం.శ్రీపార్టీష్ 29 వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలువగా, సి.హెచ్. లక్ష్మీహాసిని 116 వ ర్యాంకు, సి.హెచ్. పూర్ణచంద్ 138, ఎస్. వర్జినిరెడ్డి 211, ఎన్. రత్నప్రకాశ్ 239, పి.అక్షయ 250, ఎ. కీర్తన 274, యు. సిద్దీశ్వర్ 459, కె.ధనుష్ 556, కె.నచికేత్ 593, బి.లిఖిత్సాయి 737, యమ్. వశిష్ట 884, | కె. ప్రజ్ఞాన్ 991, రెడ్డి శ్రీకర్ 1000 వ ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ కీర్తీని మరింత ఇనుమడింపజేశారని తెలిపారు. 1000 లోపు 14 ర్యాంకులు, 2000 లోపు 18 ర్యాంకులు, 5000 లోపు 35 ర్యాంకులు సాధించగా, 450 మంది విద్యార్థులు ఐఐటీ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించడం విశేషం. రాబోయే ఐఐటీ అడ్వాన్స్ పరీక్ష వ్రాయుటకు ఎంపికైన విద్యార్థులకు అత్యుత్తమ అధ్యాపక బృందముచే కోచింగ్ ఇవ్వబడును. పటిష్ట ప్రణాలికతో విద్యా భోధన మరియు నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల మరియు అహర్నిషల కృషివల్ల అల్ఫోర్స్ ఇంతటి ఘన విజయం సాధించడం అభినందనీయం అన్నారు.రాబోయే ఐఐటీ అడ్వాన్స్ పరీక్షలో కూడ మా అల్ఫోర్స్ విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి ప్రతిష్టాత్మక ఐఐటీ లలో సీట్లు సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరము ఐఐటీ ,నీట్ మరియు ఎప్సెట్ పోటీ పరీక్షలలో అల్ఫోర్స్ విద్యార్థులు రాణిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. జాతీయస్థాయి అత్యున్నత ర్యాంకులు సాధించిన అల్ఫోర్స్ చిన్నారులను మరియు వారి తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా అభినందించారు. ఇంతటి ఘన విజయమునకు తోడ్పడిన అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు.