అందని వాడు అంబేడ్కర్ పుస్తకావిష్కరణ
చేర్యాల, అక్షిత ప్రతినిధి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కవిత పుస్తక ఆవిష్కరణ సందర్భంగా, మంగళవారం చేర్యాల మండలంలోని వేచరేణి గ్రామ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం కెవిన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ కవిత పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ ఏనుగుల దుర్గయ్య హాజరు కాగా,ఉపాధ్యాయుడు రామచంద్ర మూర్తి స్వీయ సంపాదకీయం లో విద్యార్థులు రాసిన(అందని వాడు అంబేద్కర్)కవిత పుస్తకాన్ని విద్యార్థులతో కలిసి గ్రామ సర్పంచ్ పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది.అనంతరం పలువురు మాట్లాడుతూ ఇలాంటి అద్భుత కవితలు రాయడం నిజంగా నేటి తరాలకు ఎంతో అవసరమని అన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ యాదగిరి,నాయకులు లక్ష్మీ నరసయ్య,ఉపాధ్యాయులు రామచంద్ర మూర్తి, సరస్వతి, సంతోష్ తదితర ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.