అనుభవం కలిగిన అధ్యాపకులతో ఎన్ఆర్ఎస్ ఏర్పాటు చేయడం అభినందనీయం-ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ టౌన్, అక్షిత న్యూస్:   మేధా సంపత్తు, అనుభవం కలిగిన అధ్యాపకులతో ఐఐటి స్థాయి కాలేజీని కోదాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కోదాడ పట్టణ పరిధిలోని ఎన్ఆర్ఎస్ ఐఐటి మెడికల్ అకాడమీ బుధవారం ప్రారంభించి ఆయన మాట్లాడారు. మెరుగైన విద్య కోసం విద్యార్థులు తల్లిదండ్రులను విడిచి దూర ప్రాంతాలకు వెళ్లకుండా గ్రామీణ ప్రాంత వాతావరణంలో కోదాడ పట్నంలోనే ఐఐటి అకాడమీ ప్రారంభించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ఎన్ఆర్ఎస్ ఐఐటి మెడికల్ అకాడమీ ఏర్పాటు పట్ల ఆయన ఎన్ ఆర్ ఎస్ కాలేజ్ యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం ఎన్ఆర్ఎస్ అకాడమీ చైర్మన్ వడ్డెరాజేష్ మాట్లాడుతూ.
విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు అన్ని సదుపాయాలతో ఎన్ ఆర్ ఎస్ ఐఐటి మెడికల్ అకాడమీ స్థాపించినట్లు పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక గదులతో ఏసి, నాన్ ఏసీ రూములను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించినట్లు తెలిపారు. కోదాడలోనే హైదరాబాద్కు మించిన సౌకర్యాలతో అకాడమీ ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటికే అడ్మిషన్ ప్రారంభమయ్యాయని, విద్యార్థుల తల్లిదండ్రుల నుండి పెద్ద ఎత్తున స్పందన ఉందని పేర్కొన్నారు. లిమిటెడ్ సీట్స్ ఉండటంతో విద్యార్థులు తల్లిదండ్రులు అడ్మిషన్లు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కోదాడ డిఎస్స్పీ వెంకటేశ్వర రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంపటి పద్మ మధుసూదన్, డాక్టర్ సుబ్బారావు, ఎన్ఆర్ఎస్ అకాడమీ డైరెక్టర్ యారమాసు మనోహర్ రెడ్డి, సెక్రెటరీ వై నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ వేణు, అధ్యాపకులు విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking