మెరుగైన వైద్యం అందించాలి

 

*చీమలపాడు ఘటనలో గాయపడి నిమ్స్ లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ, ఎంపీలు వద్దిరాజు,నామా*

 

*మరింత శ్రద్ధతో మెరుగైన  సేవలు అందించాల్సిందిగా అధికారులు,వైద్యులను ఆదేశించిన కేటీఆర్* 

 

*ప్రభుత్వం,పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసాన్నిచ్చిన కేటీఆర్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

 

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్, లోకసభలో  బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వర రావులతో కలిసి చీమలపాడు ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని  పరామర్శించారు.రవిచంద్ర గురువారం ఉదయం మంత్రులు కేటీఆర్,అజయ్ కుమార్,ఎంపీ నాగేశ్వరరావులతో పాటు నిమ్స్ ఆస్పత్రిని సందర్శించి,అందులో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పరామర్శించి ప్రభుత్వం,పార్టీ కొండంత అండగా ఉంటుందని భరోసాన్నిచ్చారు.

వారు నిమ్స్ అధికారులు,వైద్యుల బృందంతో  మాట్లాడి మరింత మెరుగైన సేవలందించాల్సిందిగా ఆదేశాలిచ్చారు.గాయపడిన వారిని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకోవాలని,వీరి సహాయకులు,కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండాల్సిందిగా నిమ్స్ ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, డైరెక్టర్ డాక్టర్ బీరప్పలకు కేటీఆర్ పలు సూచనలు చేశారు,సలహాలిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking