కంటి వెలుగుతో ప్రజల జీవితాల్లో వెలుగులు ప్రసాదిస్తున్న సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి
కంటి వెలుగుతో ప్రజల జీవితాల్లో వెలుగులు ప్రసాదిస్తున్న సీఎం కేసీఆర్
బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి
కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :
సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకంలో ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో వెలుగులు నిండునున్నాయని,కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని కంటి వెలుగు పథకంతో ప్రపంచాన్ని చూసే సదవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించారని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు వెల్దండ మండలంలోని రాఘయ పల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అచలమ్మరాములు,సింగిల్ విండో డైరెక్టర్ నాగులు నాయక్, మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్, నారాయణ పూర్ సర్పంచ్ అంజి నాయక్, వార్డు సభ్యులు కృష్ణ, చాంద్ పాషా, కొండల్ యాదవ్, రూపం వెంకట్ రెడ్డి, గిరి,గణేష్, తదితరులు ఉన్నారు