బంజర పకృతి వనములో కొత్త మొక్కలు నాటించిన కార్యదర్శి రేణుక అక్షిత కథనానికి కదిలిన మండల గ్రామ స్థాయి అధికారులు

బంజర పకృతి వనములో కొత్త మొక్కలు నాటించిన కార్యదర్శి రేణుక

అక్షిత కథనానికి కదిలిన మండల గ్రామ స్థాయి అధికారులు

మద్దూరు అక్షిత న్యూస్:

మద్దూరు మండలంలోని మర్మాముల గ్రామ పరిధిలోని బంజర పల్లె ప్రకృతి వనంలో నీళ్లు లేక మొక్కలు ఎండిపోతున్నాయనే వార్తకు స్పందించిన మండల గ్రామస్థాయి అదికారులు మొదటి రోజు గ్రామ పంచాయితీ కార్యదర్శి రేణుక ఆధ్వర్యంలో ఎండిపోతున్న మొక్కలకు నీరు అందించారు. అదే విధంగా రెండవ రోజు (గురువారం)చనిపోయినా మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటేందుకు కూలిల ద్వరా బ్రతికి ఉన్న మొక్కల చుట్టు పాదులు తిసి నీరు పోయించారు.

చనిపోయినా మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటి మొక్కల సంరక్షణకు తీవ్ర కృషి చేస్తున్నారని గ్రామస్తులు హర్శం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వేసవి కాలంలో గ్రామాల్లో పుష్కలంగా నీటి సౌకర్యం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం కృషీ ఎనలేనిదనీ అనందం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో గ్రామ ప్రజా ప్రతినిధులు మొక్కల పెంపకం కొసం ఎండను సైతం లెక్కచేయకుండా నీరును సరఫరా చేయడం పట్ల గ్రామ, మండల ప్రజలు అభినందిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking