మల్లయ్య కుటుంబానికి కొమ్మురవి 10 వేలు ఆర్థిక సాయం
చేర్యాల, అక్షిత ప్రతినిధి: చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన మండ మండేపల్లి మల్లయ్య ఇటీవల మరణించినందున,మండల పిఎసి ఎస్ డైరెక్టర్ కొమ్ము రవి మృతుని కుటుంబానికి 10వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భూమని బాలరాజు, జంగిటి మహేందర్, మెంటే సుధాకర్,సందబోయిన వెంకటేష్,బోయిని మల్లేశం, ఫయాజ్,ధనుష్ తదితరులు పాల్గొన్నారు.