తెలుగు జాతి గర్వించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు

తెలుగు జాతి గర్వించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు

మందమర్రి, అక్షిత ప్రతినిధి:-

తెలుగు జాతి గర్వించదగ్గ జాతీయ నాయకుడు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అని టిడిపి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ బి సంజయ్ కుమార్ తెలిపారు. మండలంలోని గుడిపల్లి, వెంకటాపూర్ గ్రామంలో గురువారం చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు. వారికి సంజయ్ పార్టీ కండవాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గ్రామంలో అన్నదాన నిర్వహించి, కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టి, ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం సంజయ్ కుమార్ మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని భగవంతుని వేడుకున్నారు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన నాయకుడని, హైదరాబాద్ హైటెక్ సిటీ, సైబరాబాద్ నిర్మాణానికి పునాది వేసిన విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అధికారం చేపట్టి పేదవారికి అండగా ఉండాలని, దీని కోసం ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేయాలని, ఈసారి చెన్నూరులో తెలుగుదేశం జెండా తప్పకుండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మందాటి రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు జక్కుల సమ్మయ్య, మహిళా ఇంచార్జ్ ఆర్ జయ శంకర్, జిల్లా నాయకులు వాసాల సంపత్, వాసాల సాగర్, పట్టణ ప్రధాన కార్యదర్శి కారం రాజు, మహిళ నాయకురాలు జూపాక సంధ్య, సువర్ణ, పద్మ, నాయకులు గోలేటి సురేందర్, సిగ్గం రవి, రంగనాథ్, రాజేష్, గడ్డం తిరుపతి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking