రాష్ట్ర స్థాయిలోనూ సత్తా చాటాలి

రాష్ట్ర స్థాయిలోనూ సత్తా చాటాలి
* బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన గుణాకర్ కు సిద్దార్ధ అభినందన 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

జిల్లా స్థాయి సీఎం కప్ బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించిన గుణాకర్ రాష్ట్ర స్థాయిలోనూ సత్తా చాటాలని యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటుగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించేందుకు అవసరమైన తర్ఫీదు అందించడంతో పాటుగా అవసరమైన ఆర్ధిక సహాయాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారని నల్లమోతు సిద్దార్ధ తెలిపారు. కాగా, ఈనెల 24న మిర్యాలగూడ పట్టణానికి చెందిన గుణాకర్ నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించి హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా గుణాకర్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఎస్ ఆగ్రోస్‌ చైర్మన్‌ తిప్పన విజయసింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ధనావత్ చిట్టిబాబు నాయక్ లతో కలిసి నల్లమోతు సిద్దార్ధ అభినందించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అనంతరం కోచ్ రవీందర్ ను వారు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking