ప్రశ్నిస్తే దాడులు చేస్తారా….?

*అడ్వకేట్ యుగేందర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం..*

 

 ప్రశ్నిస్తే దాడులు చేస్తారా….?

*- రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ది చెబుతారు..*

*- బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి*

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట గెస్ట్ హౌస్ లో నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి విలేకరుల సమావేశంలో మాట్లాడుతు… తుంగతుర్తి నియోజకవర్గంలో అడ్వకేట్ యుగేందర్ పై బీఆర్ఎస్ నాయకులు చేసిన హత్యయత్నంని ఖండిస్తున్నామని, కేవలం స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసే ఇసుక మాఫియా, లాండ్ మాఫియా, మూడెకరాల భూమి గురించి, డబుల్ బెడ్ రూమ్ ల గురించి, దళితబందు లో జరుగుతున్న స్కాంల గురించి, అడ్వకేట్ యుగేందర్ ఈ స్కాంలు అన్నీ బయటకు తీస్తున్నారనే బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని, యుగేందర్ హాస్పటల్లో జాయిన్ అయిన తర్వాత పోలీసులు వాంగ్మూలం కూడా తీసుకోలేదని, ప్రజాస్వామ్య దేశంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ నాయకులతో కుమ్మకైతే ప్రజలకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని,న్యాయవాదులకే న్యాయం జరగనప్పుడు సామాన్య ప్రజలకు ఏలా న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

పది ఎండ్ల తెలంగాణ పాలనలో ఎక్కడ చూసిన అవినీతి, దోపిడి, హింస జరుగుతుందని, ప్రజలు బీఆర్ఎస్ నాయకుల అవినీతిని గమనిస్తున్నారని రానున్న రోజుల్లో బీఆర్ఎస్ నాయకులకి తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ ఉపాధక్షులు పావిరాల నర్సింహా, మండల అధ్యక్షులు మేడి సంతోష్, ఉపాధక్షులు గుని రాజు,ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా,చిట్యాల మండల ఉపాధక్షులు గ్యార శేఖర్, కోశాధికారి మునుగోటి సత్తయ్య,బిఎస్పి సినియర్ నాయకులు బిల్లి మల్లయ్య యాదవ్,బాలాగోని మల్లయ్య గౌడ్, గాదె సురేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking