దశాబ్ది ప్రగతి వేడుకలు

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను హైదరాబాద్ నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించే విధంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా జూన్ 2 నుండి 22 వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నిర్వహించే దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై శనివారం డాక్టర్ BR. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యెక సమావేశం జరిగింది. నియోజకవర్గాల వారిగా ఈ యొక్క కార్యక్రమాలను సమన్వయము చేసేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని మంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్, GHMC కమిషనర్ లు ఈ విషయం పై ప్రత్యేకంగా సమావేశమై ఉత్సవాలు నిర్వహించే ఆయా శాఖల అధికారులతో సమన్వయము చేసుకుంటూ నియోజకవర్గాల వారిగా కార్యక్రమాన్ని రూపొందించాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఆయా శాసనసభ్యులు, MLC లు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ఉత్సవాల సందర్బంగా నిర్వహించే కార్యక్రమాలలో నిమగ్నం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జూన్ 2 వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం డాక్టర్ BR. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి గడిచిన 9 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజెప్పాలని ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆదేశించారని చెప్పారు. ఉత్సవాలలో భాగంగా ప్రతి రోజు ఒక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, MLC ప్రభాకర్ రావు, MLA లు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, కార్పోరేషన్ చైర్మన్ లు రావుల శ్రీధర్ రెడ్డి, గజ్జెల నగేష్, అయాచితం శ్రీధర్, విప్లవ్ కుమార్, మన్నె క్రిశాంక్, నగర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, BC కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, నగర పోలీస్ కమిషనర్ CV.ఆనంద్, వాటర్ వర్క్స్ MD దాన కిషోర్, సోషల్ వెల్ఫేర్ కమిషనర్ రాహుల్ బొజ్జా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన, కలెక్టర్ అమయ్ కుమార్, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, HMDA CE(లేక్స్) BN.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సాధించిన ప్రగతి గురించి ప్రజలకు తెలియజేసేలా కార్యక్రమాల నిర్వహణకు రూపకల్పన చేయాలని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణ కు పోలీసులు చేస్తున్న కృషి, స్నేహ పూర్వక విధానం, పోలీసు శాఖలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి పోలీస్ స్టేషన్ ల వద్ద ప్రజలకు తెలియజేయాలని అన్నారు. నేరాల నియంత్రణ కోసం ఉపయోగిస్తున్న ఆధునిక పరిజ్ఞానం గురించి కూడా వివరించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో వచ్చిన మార్పులు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా గురించి విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో సమావేశాలు నిర్వహించి వివరించాలని తెలిపారు. ఆసరా పించన్లు, కల్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ప్రత్యేక సభలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. KCR కిట్, న్యూట్రిషన్ కిట్, CMRF లబ్దిదారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, నూతన మెడికల్, పారా మెడికల్, నర్సింగ్ విద్యార్ధులతో సమావేశాలు నిర్వహించి వైద్య ఆరోగ్య శాఖ లో సాధించిన ప్రగతిని వివరిస్తూ రూపొందించిన ప్రత్యేక కరపత్రాన్ని పంపిణీ చేయాలని తెలిపారు. తెలంగాణ రన్ లో పోలీసు, ట్రాఫిక్, GHMC ఉద్యోగులు, సిబ్బంది, క్రీడాకారులు, యువతీ యువకులు పాల్గొనే విధంగా చూడాలని అన్నారు. మిషన్ భగీరధ కార్యక్రమం, ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యలతో త్రాగునీటి సమస్య పరిష్కారం అయిందని, నగరంలో రానున్న 50 సంవత్సరాల వరకు కూడా త్రాగునీటి సమస్య ఏర్పడకుండా కృష్ణా, గోదావరి జలాలను సరఫరా చేసే కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు. తెలంగాణ హరితోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలలో, విద్యాలయాలలో ప్రజల భాగస్వామ్యంతో మొక్కలు నాటాలని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంతో గ్రీన్ కవర్ పెంచడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. మన బస్తీ మన బడి కార్యక్రమం క్రింద అభివృద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో పనులను వేగవంతం చేసి నియోజకవర్గానికి ఒకటి లేదా రెండు పాఠశాలలను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాలలను మామిడి తోరణాలు, పూలతో సుందరంగా అలంకరించి విద్యార్ధులకు చిత్రలేఖనం, వ్యాసరచన, పాటల పోటీలు వంటివి నిర్వహించాలని చెప్పారు. ఆద్యాత్మిక దినోత్సవం సందర్బంగా దేవాలయాలు, చర్చిలు, మసీద్ లు, గురుద్వార్ ఇతర ప్రార్ధనా మందిరాలను అలంకరించి MLA లు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking