బడీడు పిల్లల ఇంటింటికి పంతుళ్లు

బడీడు పిల్లల ఇంటింటికి పంతుళ్లు

వీర్లపాలెంలో “బడిబాట” కు శ్రీకారం

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

వీర్లపాలెం/మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

బడీడు పిల్లలను బడి బాట పట్టించేoదుకు పంతులు ఇంటింటికి పయనమయ్యిర్రు. ప్రభుత్వ బడుల్లోనే గుణాత్మక విద్య సాధ్యం. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలతో పాఠశాలలో విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను ఉపాధ్యాయులు అందిస్తున్నారని పేర్కొంటూ శనివారం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని దామరచర్ల మండలం వీర్లపాలెం ప్రాథమిక పాఠశాల, వీర్లపాలెం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శ్రీకారం చుట్టారు.

ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు, రెండు జతల దుస్తులు, మధ్యాహ్నం భోజనం, ప్రతినెల ఎఫ్ఎల్ఎన్ పరీక్షలు, నిర్వహించడంతో పాటు ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతున్న విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బడి బయట ఉన్న పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు గాను ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు శనివారం వీర్లపాలెంలో ప్రతి ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. విద్యార్థుల సామర్ధ్యాల ఆధారంగా గుణాత్మకమైన విద్య బోధన చేయడంతో పాటు వెనుకబడిన విద్యార్థులలో సామర్ధ్యాలను సాధించడం కోసం ప్రత్యేక తరగతుల నిర్వహణ, పాఠ్యాంశాల బోధించుటకు అవసరమైన బోధన సామాగ్రిని వినియోగించడంతోపాటు విద్యార్థులచే వర్కింగ్ మోడల్స్ తయారు చేయించడం జరుగుతుందన్నారు. మండల, జిల్లా స్థాయిలో జరిగే విద్యా కార్యక్రమంలో విద్యార్థులను పాల్గొనే విధముగా ప్రోత్సహించడం, ప్రతి విద్యార్థికి ఆటలలో ప్రవేశం కల్పించడంతో పాటు ప్రతి విద్యార్థికి ఆరోగ్య పరీక్షలను పాఠశాలలను నిర్వహించే విధంగా విద్యాశాఖ కృషి చేస్తుందని పేర్కొంటూ ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించారు. బడిబాట ర్యాలీలో డిసిఎంఎస్ జిల్లా వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, వీర్లపాలెం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు నీలం సత్యనారాయణ ఉపాధ్యాయులు శాంత కుమారి, కనకమహాలక్ష్మి, సునీత, పాషా, మోహన్, నెహ్రూ, మాధవిలతో పాటు వీర్లపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్ నాయక్, ఉపాధ్యాయులు నసీమున్నిసా బేగం, హరితలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking