పండుగలా సాగు

పండుగలా సాగు
అంబరాన్నoటిన రైతు సంబురం
నలమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయాన్ని పండుగలా చేశారని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు.

శనివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గం మిర్యాలగూడ మండల కేంద్రంలో రైతులు, ప్రజలతో కలిసి మిర్యాలగూడ రైతు వేదికలో రైతు దినోత్సవ వేడుకలకు హాజరై భాస్కర్ రావు మాట్లాడుతూ గతంలో పాలకులు వ్యవసాయం దండిగా అన్నారని పండుగ అని కేసిఆర్ నిరూపించారన్నారు.

బియ్యం ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నదని ఆయన అన్నారు. ఒక్క మిర్యాలగూడ నియోజకవర్గం నుండి బియ్యం వేరే దేశాలకు, రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయని ఆయన అన్నారు. లక్షలు కోట్లు వరిపై రైతులకు ఆదాయం వస్తున్నదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం, రైతుభీమా రైతుకు భరోసా కల్పించారని ఆయన అన్నారు. రైతు భీమా లబ్ధిదారులు సమావేశంలో మాట్లాడుతూ భీమా వల్ల లాభం జరిగిందని, కుటుంబంలో సంపాదించే ఒకరు మరణిస్తే భీమా ఆసరా కల్పించిందని వారన్నారు. సమావేశంలో రైతు బంధు సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, మునిసిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఎంపిపి నూకల సరళ హన్మంతరెడ్డి, ఆర్డీఓ బి.చెన్నయ్య, ఎంపిడిఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, పశుసంవర్ధక శాఖ ఎండి డాక్టర్ జూలకంటి వెంకట్రెడ్డి, విత్తనం అభివృద్ధి సంస్థ రీజినల్ మేనేజర్ కృష్ణవేణీ, ఎంఎఓ స్టెఫిగ్రాఫ్, పిఎసిఎస్ చైర్మన్లు బంటు శ్రీనివాస్, పాదురి సంజీవరెడ్డిలు పాల్గొన్నారు. తొలుత పట్టణంలో రైతులు అలంకరించిన ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు కోలాటాలతో ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా మండలం పరిషత్ కార్యాలయ ఆవరణలో మహిళ రైతులతో కోలాటం ఆడారు. వచ్చిన రైతులతో ప్రజాప్రతినిధులు, అధికారులతో సహపంక్తి భోజనం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking