ఘనంగా రైతుల సమక్షంలో దశాబ్ది ఉత్సవాలు.
– వ్యవసాయ శాఖ మరియు ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో విజయవంతమైన సభ
– భారీగా తరలివచ్చిన రైతులు
– దగ్గరుండి పర్యవేక్షించిన ఏడూళ్లబయ్యారం సీఐ రాజగోపాల్, ఎస్సై పటాన్ నాగుల్ మీరా ఖాన్.
పినపాక, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో శనివారం నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకలలో భాగంగా వ్యవసాయ అధికారులు మరియు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం పినపాక వారు కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమములో ఉమ్మడి పినపాక మండలంలొ వున్న 5 రైతు వేదికలు పినపాక, బయ్యారం, జానంపేట,కరకగుడెం, అనంతారం లలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం పినపాక వారి పిలుపు మేరకు రైతులు తమతమ రైతు వేదికలకు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

పినపాక క్లస్టర్ పరిధిలో రైతు వేదిక వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది రైతులు హాజరయ్యారు. సభకు ఏవో వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్ రైతన్నకు పెద్దపీట వేశారని 10 సంవత్సరాల క్రితం ఏడు గంటల కరెంటు ని మూడు దఫాలుగా ఇచ్చేవారని దానివల్ల ఎందరో రైతన్నలు రాత్రులు మోటరు వేయడానికి వెళ్లి విద్యుత్ షాక్కు , తేలు,పాము కాటుకు గురై చనిపోయిన సంఘటనలు మనం ఎన్నో కల్లారా చూసామన్నారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత కెసిఆర్ నాయకత్వంలో రైతన్నలకు 24 గంటల కరెంటు తో పాటు, రైతుబంధు సంవత్సరానికి 10000 రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారని, దురదృష్టవశాత్తు రైతు మరణించినట్లయితే కుటుంబానికి భరోసాగా ఐదు లక్షల రైతు బీమా ను చనిపోయిన పది రోజుల్లోనే బీమా వర్తించేట్లు చేస్తూ ప్రతి రైతు కుటుంబంలో కేసీఆర్ నిలిచిపోయారని దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపారని తెలిపారు. అలాగే పినపాక క్లస్టర్ పరిది లో గల ఉత్తమ రైతులని మండల విస్తరణ అధికారుల సమక్షం లో ముగ్గురు ఉత్తమ రైతులకు సన్మానం చేశారు. మొత్తం 15 మంది రైతులకి పిఎసిఎస్ అధ్యక్షుల నిర్ణయం తో సంఘ డైరెక్టర్లు ఉత్తమ రైతులకు శాలువా కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది. అలాగే ఉత్తమ రైతులతో వారు వ్యవసాయం లో అవలంబించిన విదానాన్ని మెలుకువలను సభకు వచ్చిన రైతులకి వివరించారు. మండల పరిధిలోని మూడు క్లస్టర్లను ఏడూళ్ల బయ్యారం సీఐ రాజగోపాల్, ఎస్సై పటాన్ నాగుల్ మీర ఖాన్ తమ సిబ్బందితో దగ్గరుండి వేదికలను పర్యవేక్షించారు. పిఎసిఎస్ చైర్మన్ రవి శేఖర్ వర్మ మాట్లాడుతూ రైతులు అధిక సంఖ్య లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి ధన్యవాధాలు తెలియజేశారు. ఈ కార్యక్రమము లో , రెవిన్యు సిబ్బంది, ఎంపీడీవో, పంచాయితి సెక్రెటరీలు, ఏ ఓ మరియు ఏఈఓ లు, బరస సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్,ఎంపీటీసీ సంఘం అధ్యక్షులు చింతపంటి సత్యం,స్థానిక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, సిఈఓ కొంపెల్లి సునీల్,సొసైటీ డైరెక్టర్స్ కొండేరు రాము, కటకం గణేష్ , గునిగంటి సమ్మయ్య, తోగ్గూడం ఉప సర్పంచ్ బుస్సి శ్రీనివాసరావు ,మండల గ్రామ ప్రజాప్రతినిధులు , సంఘ డైరెక్టర్లు, సంఘ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.